Header Banner

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

  Tue May 06, 2025 10:36        Politics

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో(Telugu Desam Party) తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు (Palakondrayudu) ఇవాళ(మంగళవారం) తెల్లవారు జామున అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో పాలకొండ్రాయుడుని కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాలకొండ్రాయుడు ఈరోజు(మే6)వ తేదీన మృతి చెందారు. పాలకొండ్రాయుడు కుటుంబం నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పాలకొండ్రాయుడు మృతిపట్ల టీడీపీ అగ్రనేతలు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ్రాయుడు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో పాలకొండ్రాయుడు కుటుంబ సభ్యులకు టీడీపీ నేతలు ధైర్యం చెబుతున్నారు. ఆయన టీడీపీకి అందించిన సేవలను ఆ పార్టీ నేతలు గుర్తుతెచ్చుకుంటున్నారు.

పాలకొండ్రాయుడు రాజకీయ నేపథ్యమిదే..
పాలకొండ్రాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ తరపున తొలిసారిగా పోటీచేశారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి గెలిచారు. 1984 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 1999, 2004 ఎన్నికల్లో రాయచోటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మృతి పట్ల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. పాలకొండ్రాయుడు కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పార్టీకి విశేష సేవలు అందిస్తున్నారని చెప్పారు. రాజంపేట ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పాలకొండ్రాయుడు ప్రజల అభ్యున్నతికి విశేష కృషిచేశారని అన్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని చెప్పారు. కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మంత్రుల సంతాపం
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు మృతదేహాన్ని సందర్శించి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డిలు సంతాపం తెలిపారు. నాలుగు సార్లు రాయచోటి ఎమ్మెల్యేగా ఒకసారి రాజంపేట ఎంపీగా గెలిచిన పాలకొండ్రాయుడుది స్థానిక ప్రజలతో విడదీయలేని బంధమని మంత్రులు గుర్తుచేసుకున్నారు.

ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TDPLeaderPassesAway #Palakondrayudu #TDP #TeluguDesamParty #PoliticalLoss #FormerMP #AndhraPolitics